ప్రతి గడపలో సమస్యలన్నీ పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శిలోని ఐదో వార్డులో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్ స్తంభాలు కావాలని స్థానికులు అడగడంతో వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. సైడు కాలువల నిర్మాణాలకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ…. ప్రజా సమస్య పరిష్కారమే లక్ష్యంగా సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. సీఎం ఆదేశాల మేరకుఎమ్మెల్యేలంతా గడపగడపలో సమస్యలు తెలుసుకునేందుకు అధికారులతో కలిసి వెళ్లి సమ స్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏం కావాలో, ఏం చేయాలో, ఏం అందించాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి మంచి అవగాహన ఉంద న్నారు. అందుకే ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎంతమంది కలిసి వచ్చినా 175 సీట్లకు 175 సీట్లువైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. అధికారులు కూడా చెప్పిన వెంటనే పనులు పూర్తి చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. ముందుగా ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి ( మహేష్), గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, జిల్లారెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షుడు సాని కొమ్ము తిరుపతిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కౌన్సిలర్లు తాళ్లూరి బాబూరావు, మేడం మోహన్ రెడ్డి, వీసీ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ ఎదురు కోటిరెడ్డి, నాయకులుపుట్ట రవి, గంజి వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎర్రయ్య, హరీష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
*కొత్తరెడ్డిపాలెంలో…*
దర్శి మండలంలోని కొత్తరెడ్డిపాలెం గ్రామంలో గురువారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ నిర్వహించారు. కాలువలు, సిమెంటు రోడ్లు నిర్మించాలని స్థానికులు కోరారు. రోడ్డు, సైడు కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.


