రైతు సంక్షేమమే జగనన్న ధ్యేయం – నెరవేరిన రైతుల గ్రామస్తుల చిరకాల కొరిక – రూ. 50 లక్షల వ్యయంతో మూసీ నదిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి

రైతు సంక్షేమమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ అన్నారు. దర్శి మండలంలోని పెదఉయ్యాల వాడ-కృష్ణాపురం మధ్యలో రూ.50 లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణా నికి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి గురువారం శంకుస్థాపన చేశారు. సచివాలయంలో గ్రామ సభ నిర్వహించారు. అనంతరం కొత్తపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృ తిచెందిన ఇల్లూరి పెద్ద గాలిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మృతికి గల కారణాలడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ …బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పొదిలి – ఒంగోలు రోడ్డుకు చేరుకోవడానికి రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. రైతులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు కొనసాగించుకోవాలనే ఉద్దేశంతో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామ న్నారు. ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు . సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని, రైతులందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎరువులు, పురుగు మందులన్నీ అందజేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి అన్నారు . కార్యక్రమంలో ఎంపీపీ సుధాఅచ్చయ్య, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, సర్పంచ్ లు రాము, మురళీ మోహన్, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, నాయకులు రుద్రా వెంకట్రావు, పోతం శెట్టి శివరామయ్య, రత్తయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *