పేదల సొంతింటి కల నెరవేర్చడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ పేర్కొన్నారు. ముండ్లమూరు మండలంలోని వేముల గ్రామం లో జగనన్న కాలనీలో శుక్రవారం గృహప్రవేశాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ.. పేదల ఇళ్ల నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం వైఎస్ జగన్ వాటిని అధిగమించారన్నారు. పేదలకు అండగా ఉంటూనే అర్హులైన అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దర్శి నియోజకవర్గంలో మొదటిసారి జగనన్న కాలనీలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంకా ఎవరికైనా ఇళ్లు, ఇంటి స్థలం కావాలంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముందుగా గ్రామస్తులు మేళతాళాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి, సన్మానించారు.
*పేదలకు వరం ఓటీఎస్*
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్ పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. వేములలో శుక్రవారం ఓటీఎస్ లబ్ధిదారులు 93 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి పట్టాలు మంజూరు చేసి శాశ్వతంగా హక్కు కల్పించడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. పేదల పక్షపాతిగా నిలిచిన సీఎం వైఎస్ జగన్ అన్న ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సుంకర సునీత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మారెడ్డి, రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, సచివాలయాల మండల
కన్వీనర్ మేడికొండ జయంతి, సొసైటీ అధ్యక్షుడు కుమ్మిత వెంకటరెడ్డి, ఎంపీడీఓ హనుమంతరావు, హౌసింగ్ ఏఈ హనుమంతరావు, నాయకులు రామముసలారెడ్డి, మోషిరెడ్డి, అంబటి వెంకటేశ్వరరెడ్డి, సందయ్య, బచ్చు గురవారెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, కుమ్మిత శ్రీనివాసరెడ్డి, గురవారెడ్డి, అన్నపురెడ్డి రమ ణారెడ్డి, పాలెపోగు డగ్లస్, భిక్షాలు రెడ్డి, సర్పంచ్లు జమ్ముల గురవయ్య, జనమాల నాగేంద్రంపిచ్చయ్య, అంబటి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
