తాళ్లూరు మండలంలోని తూర్పుగంగ వరం గ్రామానికి చెందిన వల్లభ నేని జ్యోతి గ్రూప్ -1 ఫలితాల్లో ర్యాంక్ సాధించి ఎంపీడీవోగా ఎంపికయ్యారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కా ర్యదర్శి వల్లభనేని చినసుబ్బారావు (సుబ్బయ్య) కుమార్తె వల్లభనేని జ్యోతి బీఎస్సీ (ఈక్వలెంట్ క్వాలిఫికేషన్) డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కు హాజరైంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్ పరీక్షలుకు హాజరై ర్యాంకు సాధించారు. విజయవాడలోముఖాముఖి జరిగిన ఇంటర్వ్యూలో జ్యోతి హజ రు కాగా ఎంపీడీవోగా ఎంపికయ్యారు. ఓసీ మహిళలకు 11 ఎంపీడీవో పోస్టులు ఉండగా జ్యోతి ఎంపికయ్యారు. తూర్పు గంగవరానికి చెందిన యువతి వల్లభనేని జ్యోతి ఎంపీడీవోగా ఎంపిక కావడం పట్ల ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శులు మానం రమేష్బాబు, శాగం కొండారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబు ల్రెడ్డి, తూర్పు గంగవరం గ్రామ టీడీపీ అధ్యక్షుడు కని శెట్టి రామలక్ష్మయ్య, మీరామొహిద్దీన్ తదితరులు అభినందలు తెలిపారు. జ్యోతి కుటుంబ సభ్యుల సమక్షంలో అభిమానులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.
