వైఎస్సార్ సీపీదే విజయం-బాపట్ల జిల్లాలోఆరు అసెంబ్లీ స్థానాలు మావే – ప్రజలంతా సంక్షేమ సర్కారు వైపే..ప్రతి ఇంటికీ పథకాల లబ్ధి-విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి

రాబోయే ఎన్నికల్లో బాపట్ల జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  వైస్సార్సీపీ సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రీజినల్ కో-ఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  రెండురోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన విజయసాయిరెడ్డి గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో అద్దంకి, పర్చూరు, చీరాల, రేపల్లె నియోజకవర్గాలను పోగొట్టుకున్నామని, రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, ముఖ్యనేతలు, ప్రజలతో మాట్లాడిన తర్వాత గెలుపుపై స్పష్టత వచ్చిందన్నారు. జిల్లాలో రీజినల్ కో-ఆర్డినేటర్ హోదాలో తొలిసారి పర్యటించి అందరితోనూ సమావేశమయ్యామని పేర్కొ న్నారు. రెండో విడతలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పర్యటన ఉంటుందని వివరించారు. మూడో విడతలో ప్రజల ఆసక్తిని దృష్టిలో పెట్టు
కొని, వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల సమన్వయం కోసం కో-ఆర్డినేటర్ల సమా వేశాలు మండల స్థాయిలో జరుపుతామని వెల్లడించారు. జగనన్న సురక్ష ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తోందని, ఎక్కడైనా మిగిలి ఉంటే ఆ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. బాపట్ల నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు  స్థలం అడిగారని, దీనిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. బాపట్లలోని అంబేడ్కర్ భవన ఆధునికీకరణ కోసం రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారని, ఆ నిధులను ఎంపీ లాడ్స్ నుంచి మంజూరు చేస్తానని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. ముస్లిం షాదీఖానా పెండింగ్ పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అద్దంకి, చీరాల పర్చూరులో ఎటువంటి సమస్యలూలేవన్నారు. ఏ నియోజకవర్గానికి చెందిన ఇన్చార్జిలందరూ  పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తున్నారన్నారు. భవిష్యత్లో సమస్యలు పునరావృతం కావని చెప్పారు.
*ప్రతి సీటూ గెలవాల్సిందే*
రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని ప్రతి సీటూ గెలవా ల్సిందేనని, ఇందుకోసం నియోజకవర్గ ఇన్చా ర్జిలు, నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాపట్ల, పర్చూరు, చీరాల, రేపల్లె, అద్దంకి, వేమూరు నియోజకవర్గాల ఇన్చార్జిలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమీక్షలు నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేకూరు స్తున్న లబ్ధిని, ప్రజల్లో వస్తున్న స్పందనను అడిగి తెలుసుకున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా చర్చించారు. పార్టీ శ్రేణుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ మరింత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిం చారు. పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కార్య క్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, పార్టీ చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్, అద్దంకి ఇన్చార్జి బాచిన కృష్ణచై తన్య, పర్చూరు ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *