దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్ గా కందె గంగయ్య, సభ్యులుగా భవనం మురళీకృష్ణారెడ్డి, చెన్నంశెట్టి శ్రీనివాసరావు, అబ్బు నరసమ్మ, అడ్డగిరి వెంకటనారాయణ, అడుసుమల్లి రాజ్యం, శాగం రోశమ్మ, లవనూరి సుబ్బులు, షేక్ రసూల్బాషా,దాసరి ఏలియా, ముక్తిపూడి జెమీమా, దేవర కొండ వెంకటేశ్వర్లు, గంజి వెంకటేశ్వరరెడ్డి, షేక్ నసీమా నియమితులయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ హానరీ చైర్మన్ , మెంబర్లుగా పీఏసీఎస్ అధ్యక్షుడు చెన్నారెడ్డి, జిల్లా ట్రేడ్ అండ్ మార్కెటింగ్ అధికారి, అగ్రికల్చర్ డైరెక్టర్, నగర పంచాయతీ చైర్మన్ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
