బాలికల సంక్షేమ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ –
చికెన్ చాలకపోవడంతో అప్పటికప్పుడు తెప్పించి పెట్టిన వైనం
జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆడపిల్లల పట్ల తన తల్లి మనస్సును చాటు కున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు చీమకుర్తిలోని బాలికల హాస్టలు ఆకస్మికంగా సందర్శించారు. మెనూ ప్రకారం హాస్టల్ బాలికలకు చికెన్ కర్రీతో బిర్యానీ పెట్టాలి. హాస్టల్ సిబ్బంది తయారు చేసిన చికెన్ కర్రీని బూచేపల్లి వెంకాయమ్మ స్వయంగా బాలికలకు వడ్డించారు. ఇంకా తినాల్సిన బాలికలు సగం మంది ఉండటంతో పిల్లల ముఖాలు చూసి ఖాళీ కడుపుతో ఎలా ఉంటారని ఆవేదన వ్యక్తం చేసి తన సిబ్బందితో అప్ప టికప్పుడు చికెన్ తెప్పించి వంటచేసి పిల్లలకు పెట్టారు. దాంతో బాలికలు సంతోషంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. పదో తరగతి విద్యార్థిని మరియమ్మ పుట్టిన రోజు కావడంతో జెడ్పీ చైర్ పర్సన్ కేకు కట్చేసి విద్యార్థినికి పెట్టారు. హాస్టల్ బాలికలందరికీ చాక్లెట్లను తెప్పించారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న వార్డెన్ ఇన్చార్జి కావడంతో
పర్మినెంట్ వార్డెన్ ను నియమించేందుకు జిల్లా ఉన్న తాధికారులతో మాట్లాడతానని చెప్పారు. దానితో పాటు 80 మంది పిల్లలకు మాత్రమే సరిపోయే సామర్ధ్యం ఉన్న హాస్టల్లో దాదాపు 160 మంది బాలి కలు ఉండటానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పటంతో బాలికల కోసం హాస్టల్-2ను మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటానని ఆమె భరోసా ఇచ్చారు. ఆమె వెంట జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు పాలపర్తి వెంక ట్రావు, గోపురపు చంద్ర, బాలు ఉన్నారు.



