వార్డు మెంబర్ గా పోసి పోగు మౌనిక

ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు పంచాయతీ పరిధిలో గల చింతలపూడి గ్రామంలో 10వ వార్డుకు జరిగిన వైయస్సార్ సిపిబలపరిచిన అభ్యర్థి పోసి పోగు మౌనిక విజయం సాధించారు. మొత్తం246 ఓటుకు గాను 231 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో వైయస్సార్ సిపి బలపరిచిన అభ్యర్థి పోసి పోగు మౌనికకు122 ఓట్లు రాగా టీడిపి బలపరిచిన అభ్యర్థి దాసరి సోనీ కి 39 ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో డిపాజిట్ గల్లంతయ్యింది. సంగు విజయలక్ష్మి కి 61 ఓట్లు దాసరి ఏమేలమ్మకు ఒక్క ఓటు రాగా 8ఓట్లు చెల్లకుండ పోయాయి. పోసి పోగు మౌనిక 21 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండడంతో దర్శి సీఐ జే రామకోటయ్య పర్యవేక్షణలో ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, ఎస్సైలు యు వి కృష్ణయ్య, బి ప్రేమ్ కుమార్, డి రామకృష్ణ. ఏఎస్ఐ మోహనరావు, ఎస్బిఐ బాజీ 20 మంది పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్శి డిఎస్పి అశోక్ వర్ధన్ రెడ్డి పోలింగ్ స్టేషను సందర్శించి ఓటర్ల సర్వేను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఓటర్ల కు సూచించారు. అదే విధంగా భీమవరం రెండో వార్డు గుంటూరు నాగేంద్రమ్మ, వేంపాడు 11వ వార్డు గండి మరియమ్మలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఆర్వోగా కె విజయకుమార్, ఎంపీడీవో ఎన్బిఎల్ హనుమంతరావు జోనల్ ఆఫీసర్ కే వెంకటేశ్వర్లు. పోలింగ్ ఆఫీసర్ ఏలేవి ప్రసాద్. రూట్ ఆఫీసర్ గా ఈ రాజశేఖర్ రెడ్డి వీఆర్వో సుశీల, పంచాయతీ కార్యదర్శి మౌలాలి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *