పంట కోత ప్రయోగాలు ఖచ్చితంగా చెయ్యాలి – వ్యవసాయ సహాయకులు, సహాయ గణాంక అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహణ

పంట కోత ప్రయోగాలు ఖచ్చితంగా చెయ్యాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఉందని దర్శి ఎడీఏ బాలాజి నాయక్ అన్నారు. కెవికెలో శనివారం దర్శి డివిజన్ పరధిలోని దర్శి, కురిచేడు, ముండ్లమూరు, దొనకొండ, మర్రిపూడి, కొనకల మిట్ల, తాళ్లూరు మండలాలలోని వ్యయసాయ సహాయకులు, సహాయ గణాంక అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏడిపి బాలాజి నాయక్ మాట్లాడుతూ… పంట కోత ప్రయోగంతో దేశ ఆర్ధిక అభివృద్ధికి ఎంతో ముఖ్యమని అన్నారు. పంటల దిగుబడి అంచనాకు. ప్రభుత్వం ఎగుమతి. దిగుమతి పాలసీలపై నిర్ణయం తీసుకొనుటకు చాలా ముఖ్యమని చెప్పారు. ముఖ్యంగా రైతు అకాల వర్షాలు, కరువు నేపధ్యంలో నష్టపోయిన సమయంలో రైతులను పంటల భీమా పథకం ద్వారా ఆర్థికంగా ఆదుకునేందుకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లాలో వరి, సజ్జ, కంది, మిరప, శనగ, మినుము పైరులను పంట భీమా పథకంలో ఉన్నాయని చెప్పారు. ఈ పైరులను ఎన్సీఐపీ యాప్ ద్వారా, మిగిలిన పైపులను ఏపీ సీఈఈ యాప్ ద్వారా “ప్రయోగాలు చెయ్యాలని అధికారులు వివరించారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక కార్యాలయ ఉప గణాంక అధికారి ఎం. వి వాసుదేవరావు, సుధాకర్, దర్శి డివిజన్ పరధిలోని వ్యవసాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *