ఎట్టకేలకు తాళ్లూరు ఎంపీడీఓ కె రాఘవేంద్రను నియమిస్తూ జిల్లా పరిషత్ సీఈఓ బి. జాలి రెడ్డి నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసారు. తాళ్లూరు ఎంపీడీఓగా పనిచేస్తున్న కె వై కీర్తి ట్రైనింగ్ కి ఎప్రియల్ నాలుగు నుండి సెప్టెంబర్ వరకు వెళ్లటంతో ఆమె స్థానంలో ఎఫ్ఎసీ ఎంపీడీఓగా మద్దిపాడు ఎంపీడీఓ వై. శ్రీనివాసరావును నియమించారు. అయితే ఆయన ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులతో సరియైన కో ఆర్డినేషన్ లేక పోవటంతో ఎంపీడీఓ పనితీరుపై తీవ్ర విమర్శలు ఎదురైనాయి. చివరికి అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు ఎంపీడీఓ పనితీరు, ప్రవర్తనపై ధర్నా చేయటంతో పాటు, ఇటీవల జరిగిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఈ విషయమై కలెక్టరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసారు. ఇక తప్పనిసరి పరిస్థితులలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్చార్జి ఎంపీడీఓ నియామకం జరిగినది. ఎట్టకేలకు ప్రజా స్వామ్యంతో ప్రజా ప్రతినిథులకు సరియైన ప్రాధాన్యత ఇవ్వకుండా “ఏకపక్షంగా వ్యవహరించిన ఎంపీడీఓ వై. శ్రీనివాసరావును ఎఫ్ఎసీగా తొలగించటంపై స్థానిక ప్రజా ప్రతినిథులు హర్షం వ్యక్తం చేసారు.


