పసుపుగల్లులో ఉప ఎన్నిక పూర్తి- ఎమ్మెల్యే మద్దతుదారులు గెలుపు.

ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు పంచాయతీ చింతలపూడి గ్రామంలో జరిగిన పదవ వార్డు ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మద్దతు దారులైన పోసిపోగు మౌనిక 61 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. పదవ వార్డులో మొత్తం 246 ఓట్లు ఉండగా వాటిలో 231 ఓట్లు పోలయ్యాయి.వాటిలో వైసీపీకి చెందిన పోసిపోగు మౌనికకు 122 ఓట్లు వచ్చాయి, వైసీపీలోనే మరో అభ్యర్థిగా ఉన్న సంగు విజయలక్ష్మి కి 61 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా టిడిపి బలపరిచిన అభ్యర్థి దాసరి సోనీ కు 39 ఓట్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి ఎమెలమ్మ ఒక్క ఓటు వచ్చింది. మొత్తం ఓట్లలో 8 ఓట్లు చెల్లనివిగా మిగిలిపోయాయి. పసుపుగల్లు పంచాయతీ ఉప ఎన్నికలో ఎమ్మెల్యే మద్దతు దారులైన పోసిపోగు మౌనిక 61 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ చింతలపూడి 10వ వార్డు ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *