సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి వాకిన్ రిక్రూట్మెంట్

డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ( ఎపివివిపి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రులలో ఖాళీగా వున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు  ఆహ్వనిస్తున్నట్లు  ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు మెంబర్ సెక్రెటరీ ఎం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.  రెగ్యులర్ (పరిమిత/జనరల్ రిక్రూట్ మెంట్), కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించే ఈ పోస్టుల అర్హతా ప్రమాణాలు, నిర్ణీత మార్గదర్శకాలను https://hmfw.ap.gov.in వెబ్ సైట్ నుండి పొందవచ్చని ఆయన సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తమ దరఖాస్తులను వాకిన్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.
*వాకిన్ రిక్రూట్ మెంట్ షెడ్యూలు వివరాలు*
సెప్టెంబర్ 5న జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాలకు, సెప్టెంబర్7న గైనకాలజీ, అనెస్థీషియా, ఇ ఎన్ టి, పాథాలజీ విభాగాలకు, సెప్టెంబర్ 10న పెడియాట్రిక్స్,  ఆర్థోపెడిక్స్,  ఆప్థమాలజీ,  రేడియాలజీ, గుండె వ్యాధుల విభాగాలకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ నియామకపు ప్రక్రియ ఉంటుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *