దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులం దరికీ మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని వ్యవ సాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ షకీలా అన్నారు. దర్శి మార్కెట్ యార్డ్ లో షకీలా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను మార్కెట్ యార్డ్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఏఎంసి ఛైర్మన్ షకీలా మాట్లాడుతూ …అందరి సలహాలు సూచన లతో మార్కెట్ యార్డ్ ను విజయపథంలో నడి పిస్తామని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ లో కూడా రిజర్వేషన్లు పెట్టి ముస్లిం మహిళకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తొలిసారి ఇవ్వడం హర్షణీయమన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో మండల కన్వీనర్ , మాజీ ఏఎంసీ చైర్మన్ వెన్నపూస వెంకటరెడ్డి ( మహేష్), రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, షేక్ అమీన్ బాషా, సెక్రటరీ ఎఫ్ఎసీ తుమ్మల పూడి మస్తాన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.


