ఖరీఫ్ లో వరి సాగు చేసిన రైతులు చిరు పొట్టదశలో పొటాష్ ఎరువును వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. వ్యవసాయ పర్యటనలో భాగంగా తాళ్లూరులో పొట్టదశలో ఉన్న వరిని పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ… చిరుపొట్ట దశలో నత్రజని ఎరువును వాడడం వలన గింజ మెత్తదనం వచ్చి మిల్లింగ్ సమయంలో ముక్కలవుతుందన్నారు. పూత సమయంలో నత్రజని ఎరువులను వాడరాదన్నారు. పొటాషియం వాడడం వల్ల కలిగే ప్రయోజ నాలను వివరించారు. ఏఈఓ నాగరాజు, రైతులు పాల్గొన్నారు.
