ప్రభుత్వ బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

2023-24 వ సంవత్సరానికి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(బాలికలు), ఒంగోలు నందు 3 వ విడత ప్రవేశాల కొరకు ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, క్రాఫ్ట్ మెన్ సివిల్, సూయింగ్ టెక్నాలజీ(టైలరింగ్) ట్రేడ్స్ నందు అడ్మిషన్స్ కొరకు ఆన్ లైన్ ద్వారా (వెబ్ సైట్) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఒంగోలు,పారిశ్రామిక శిక్షణ సంస్థ(బాలికలు), ప్రిన్సిపాల్
పి. ఉమామహేశ్వరి దేవి ఒక ప్రకటనలో తెలియజేసారు. అర్హులైన అభ్యర్థులు ITl.ap.gov.in అనే వెబ్ సైట్ ద్వారా తమ దరఖాస్తులను తేది 27.08.2023 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మరియు ప్రింట్ కాపీని download చేసుకొని దరఖాస్తు ఫారం మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (బాలికలు), ఒంగోలు నందు 28.08.2023 తేదిన సర్టిఫికేట్ ధృవీకరణకు మరియు 30.08.2023 తేది నాడు కౌన్సిలింగ్ కు హాజరు కావలెనని తెలిపారు. అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ లను కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించవలెనని తెలియజేశారు పూర్తి వివరములకు సెల్ 8977711292, 7799976888 కు లేదా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (బాలికలు), ఒంగోలు నందు పని వేళల యందు సంప్రదించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *