ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ 15వ వార్షికోత్సవం మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వారికి గణపతి పూజలతో పాలు పలు పూజలు శాస్త్రయుక్తంగా పూజారులు నూతలపాటి ప్రసాద్. నూతలపాటి వెంకటేశ్వర శర్మలు మంత్రోచ్చారణ మధ్య నిర్వహించారు. ఉభయ దాతలుగా బిజ్జం క్రిష్ణా రెడ్డి జ్యోతి దంపతులు, కోట బ్రహ్మా రెడ్డి, పద్మ దంపతులు వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. |


