ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి టి. భర ద్వాజ అన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ( ఎపీఎస్ఎస్ డిసీ), జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సిడాప్ల సంయుక్తంగా మినీ జాబ్ మేళాను నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా నైపుణ్య అధికారి ఆర్ లోక నాథం మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యం అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల మెగా, మినీ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యను అభ్యసించి ఖాళీగా ఉంటున్న యువతీ యువకులు వారు విద్యార్హత, నైపుణ్యంను బట్టి తగిన ఉద్యోగం పొందుటకు జాబ్ మేళాలలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని కోరారు. తగిన ఉద్యోగం పొంది ఆర్థికంగా కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. మినీ జాబ్ మేళాలో 153 మంది పాల్గొనగా 33 మంది రైతులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. మినీ జాబ్ మేళాలలో రిలయన్స్ ట్రెండ్స్, ఇన్నోవ్ సోర్స్, ఎస్బిఐ కార్డ్స్, తిరుమల ఆటోమోటివ్స్, సీఎంఆర్ ఎకో అల్యూమినియం ప్రవేట్ లిమిటెట్, పలు కంపెనీలు హెచ్ఎఆర్ఎస్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజారావు, జెఈఓలు ఇంద్రాణి, శ్రీను, ఎడీ ఎసి బాష, ప్లెస్మెంట్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసచారి, హెచార్ స్కిల్స్ హబ్ కోఆర్డినేటర్ అనూష, విద్యాసాగర్, రహమాన్లు పాల్గొన్నారు.



