డబల్ ఎంట్రీ ఓట్లు, ఒక్కొక్కరికి రెండు చోట్ల ఉండే ఓట్లు గుర్తించి తమ దృష్టికి తీసుకువస్తే తొలగిస్తామని ఫారెస్ట్ సెటిల్మెంట్ అధి కారి, ఎన్నికల అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు సూచించారు. స్థానిక రెవెన్యూ కార్యా లయంలో మంగళవారం అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఎన్నికల సందర్భంగా సమావేశం నిర్వహించారు. అనంతరం డీవీ ఎస్ కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. 2024 జనవరి నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఉన్న వారి వివరాలు తెలియపరిచి ఓటుహక్కు పొందాలన్నారు. దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు తహసీల్దార్లు వెంకటేశ్వరరావు, యం. సువర్ణ, జ్వాలా నరశింహారావు, అహమద్, కేవీ ప్రసాద్, నగర పంచాయతీ కమిషనర్ వై. మహేశ్వరరావు, డీటీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

