తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో గల గీతాంజలి హై స్కూల్ కరస్పాండెంట్ యాతం శ్రీనివాస్ రెడ్డి సతీమణి యాతం అంజలి ప్రమాదవశాత్తు మృతి చెందారు.వారి స్వగ్రామమైన నాగంబొట్లపాలెం నుండి తూర్పు గంగవరం కు వెళ్తుండగా బైక్ పై నుండి కింద పడి మృతి చెందినట్లు సమాచారం. గీతాంజలి హై స్కూల్ అభివృద్ధిలో అంజలి పాత్ర కీలకమంటూ పలువురు చెప్పుకుంటున్నారు.

