తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెం గ్రామంనుండి మోటార్ సైకిల్ పై భార్యా భర్త లు, ఇద్దరు పిల్లతో కలిసి వెలుతుండగా భార్య చున్ని మోటార్ సైకిల్ చైన్ లో పడి మెడకు బిగుసుకుని వెనుకకు పడి తలకు బలమైన గాయం కావటం తో మహిళ మృతి చెందింది. ఈఘటనపై ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీసు స్టేషనులో బుధవారం కేసు నమోదయింది. వివరాల్లోకి వెలితే…. తాళ్లూరు మండలంలోని నాగంబొట్లపాలెం గ్రామానికి చెందిన యాతం శ్రీనివాసరెడ్డి, భార్య వి. అంజలిలు తూర్పు గంగవరంలో గీతాంజలి హైస్కూలును నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గీతాంజలిస్కూల్ డైరెక్టర్ గా వున్నాడు. నిత్యం నాగం బొ ట్లపాలెం నుండి ఉదయం 8.30 గంటలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంటారు. గత నాలుగురోజులుగా స్వల్పజ్వరంతో ఇంటి వద్దే వున్న అంజలి బుధవారం భర్తతోపాటు తూర్పు గంగవరంబయలు దేరారు. వారి కుమార్తెలు గీతాంజలి స్కూలు నందే చదువుతున్నారు. దీంతో శ్రీనివాసరెడ్డి, భార్య అంజలి, ఇరువురు కుమార్తెలనుతీసుకుని మోటార్ సైకిల్ పై తూర్పు గంగవరం వెలుతున్నాడు. మార్గ మద్యంలో యర్ర వాగు వద్ద వచ్చే సరికి వెనుక పంచాబీ డ్రస్ వేసుకుని కూర్చున్న అంజలి మెడలో ని చున్నీ మోటార్ సైకిల్ చైన్ చుట్టుకుని మెడకు బిగసటంతో వెనుకకు వెళ్లికలా రోడ్డుపై పడి పోయింది. వెంబడే బైక్ నిలిపి చూడగా అంజలి తల వెనుక భాగంలో తీవ్ర గాయంమై రక్త స్రావమైంది. ఆమె ఉలుకు, పలుకు లేకుండా పడి వుండటంతో ముందుగాతూర్పు గంగవరం ఆర్ఎంపీ వైద్యుల వద్దకు వెళ్లి పరిస్థితి సీరియస్ వుందని ఒంగోలుకు తీసుక వెళ్లాలని సూచించారు. ఆమెను ఒంగోలుకు తరలిస్తుండగా గుంటిగంగ సమీపంలోని మర్రి చెట్టు వద్దకు వెళ్లే సరికి మృతి చెందింది. మృతు రాలికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. మృతురాలి భర్త శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ ఎం రమేష్ కేసు నమోదు చేశారు.
*గ్రామంలో విషాదచాయలు*
అంజలి మృతి చెందిన వార్త తెలియగానే గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. అప్పుడే తూర్పు గంగవరం స్కూల్ కి బయలు దేరగా అంజలి రోడ్డు ప్రమాదం లోమృతి చెందినట్లు తెలియగానే ప్రజలు నమ్మలేక పోయారు. గీతాంజలి హైస్కూల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న శ్రీనివాసరెడ్డి, అంజలిదంపతులు అందరితో అన్యోన్యము గా వుండేవారని గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు విద్యాసంస్థల అధిపతులు డైరెక్టర్లు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శ్రీనివాస్ రెడ్డికి ధైర్యాన్ని చెప్పారు.


