తాళ్లూరు మండలంలో విద్యుత్తు బకాయిల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు దర్శివిద్యుత్తు ఏడిఈ కె.పిచ్చయ్య తెలిపారు. స్థానిక విద్యుత్తు సబ్ స్టేషన్ ను బుధవారం పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. తాళ్లూరు మండలంలో ప్రభుత్వకార్యాలయాలనుండి రూ. కోటి 75లక్షలు, గృహా, వ్యాపార, వ్యవసాయ సర్వీసుల నుండి రూ .2 కోట్ల 86లక్షల మేర బకాయిలు వున్నాయన్నారు. సిబ్బంది బకా యిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయాలని తెలిపారు. దీర్ఘకాలిక పెండింగ్ బకాయిలు జమచేయకంటే ఆసర్వీసులను తొలగించాలని తెలిపారు. వ్యవసాయ కనెక్షన్ కోసం ధరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలందు పనులకు ఇబ్బందులు లేకుకుండా ఉన్నతాధికారుల అనుమతి తీసుకుకుని విద్యుత్తుకు అంతరాయం లేకుండా చూడాలని ఏఈ వీరబ్రహ్మంకి సూచించారు.

