మోపెడ్ ను ఢీకొన్న ఆటో -విఆర్ఏకు తీవ్ర గాయాలు

మోపెడ్ ను గుర్తు తెలియని ఆటో ఢీకొనడంతో వీఆర్ఎకు తీవ్రగాలయ్యాయి. ఈ ఘటన తూర్పు గంగవరం, దర్శి ఆర్ అండ్ బి రోడ్ లో ఎర్ర వాగు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తూర్పు గంగవరంకు చెందిన కొమ్ము దావీదు అదే గ్రామంలో వీఆర్ఎగా పనిచేస్తున్నాడు. శనివారం వ్యక్తిగత పనుల మీద ద్విచక్ర వాహనంపై దర్శి వెళ్లి తిరిగి తూర్పు గంగవరం వస్తున్నాడు. ఈ క్రమంలో ఎర్ర వాగు వద్ద గుర్తు తెలియని ఆటో ఢీకొట్టడంతో దావీదుకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సహాయంతో స్థానిక పీహెచ్సీ వైద్యశాలకు తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కి తరలించారు. ఆటో – వీఆర్ఎకు తీవ్ర గాయాలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *