జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరణ – పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రకాశం జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ డాక్టర్. కె శ్రీనివాసులు

జాబ్ మేళా పోస్టర్ ను ప్రకాశం జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ డాక్టర్. కె శ్రీనివాసులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ డాక్టర్. కె శ్రీనివాసులు మాట్లాడుతూ… కంభం, గిద్దలూరు కాన్సెన్సీ లో ఉన్నటువంటి యువకులు అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, అన్నా రాంబాబు సహకారంతో గిద్దలూరు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చాలనచేకూర్చలనే సదుద్దేశంతో 2023 సెప్టెంబర్ 1న శుక్రవారం రోజున గవర్నమెంట్ జూనియర్ కళాశాల, కంభం, నందు 11 కంపెనీలతో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. కావున జిల్లాలో ఉన్నటువంటి పదవ తరగతి నుంచి పీజీ (SSC to PG) వరకు చదివిన 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరముల మధ్య గల నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యి ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరుచున్నాము.
ఇతర వివరములకు ఈ క్రింద తెలుపబడినటువంటి ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు.
R.బెనర్జీ బాబు:8008822821
S. ఫిరోజ్ గాంధీ : 7013950097
ఈ కార్యక్రమంలో శ్రీ.టి రవికుమార్ , పిడి డిఆర్డిఏ అండ్ పిడి మెప్మా, శ్రీ.టి భరద్వాజ్ , జిల్లా ఉపాధి కల్పన అధికారి, శ్రీ. వెంకటేశ్వర్లు డిడి, అడల్ట్ ఎడ్యుకేషన్, ఆర్. లోకనాథం, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, ఈశ్. భాష, ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్, పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *