జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె. శ్రీనివాసులు బుధవారం స్థానిక మామిడిపాలెంలోని ఈ.వి.ఎం. గోదాములను సందర్శించారు. నెలవారీ తనిఖీలలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదాములు షట్టర్లకు వేసిన తాళాలు, వాటి సీలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గోదాములకు కల్పిస్తున్న భద్రత, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట వై.సి.పి. తరఫున దామరాజు క్రాంతి కుమార్, బి.జె.పి. తరఫున గుర్రం సత్యం, కాంగ్రెస్ తరఫున రసూల్, మరియు జిల్లా అధికారులు ఉన్నారు.
ఈ.వి.ఎం. గోదాములను సందర్శించిన ఇన్ఛార్జి కలెక్టర్ కె. శ్రీనివాసులు
30
Aug