ఘనంగా రక్షా బంధన్, నారదముని జయంతి వేడుకలు నిర్వహణ – మొదటి విలేకరి.. నారద మహర్షి

భారతదేశంలో మొదటి విలేకరి నారద మహర్షి అని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రాంత ప్రచారక్ విజయ ఆదిత్య అన్నారు. దర్శి ఐటీసీ హనుమంతరావు కల్యాణ మండపంలో రక్షాబంధన్, నారద మహర్షి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. విజయ ఆదిత్య మాట్లాడుతూ …నారద జయం తి-జర్నలిజం-భారతీయత అనే అంశం గురించి వివరించారు. భారతదేశ గొప్పదనం, జర్నలిస్టు సేవలు, ఆర్ఎస్ఎస్ భావాలను జర్నలిస్టులతో పం చుకున్నారు. అనంతరం నియోజకవర్గంలోని 10 మంది సీనియర్ జర్నలిస్టులను దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. యేరువ
లక్ష్మీనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో జర్నలిస్టులు, జిల్లా ప్రముఖ్ బాబు, దర్శి ప్రాంత ప్రచార ప్రముఖ మేడగం ఈశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *