తాళ్లూరు మండలంలో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు మండల కేంద్రంలోని శివాలయం వద్ద, తూర్పు గంగవరంలో బూచేపల్లియూత్ ఆధ్వర్యంలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి, మాజీ ఎంపీపీలు కోట రామిరెడ్డి, గోళ్లపాటి మోషే, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ ఆదాం షరీఫ్ (బుజ్జి) లు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, ఎంపీటీసీ యానుర్తి ప్రభుదాస్, మాజీ జెడ్పీటీసీ నాగరాజు, ఎఎంసీ మాజీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, దోసకాయలపాడు సర్పంచి కెఎస్ వెంకటరామిరెడ్డి, పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు పెద్ది రెడ్డి, నాగిరెడ్డి, కోట శ్రీనివాస రెడ్డి, టి బాలక్రిష్ణా రెడ్డి, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు దేవదానం, యూత్ ప్రధాన కార్యదర్శి జక్కుల రామక్రిష్ణ, తిరుపతి రెడ్డి, కొండా రెడ్డి, హనుమా రెడ్డి, సుబ్బారావు. హరిబాబు, కోట క్రిష్ణా రెడ్డి, బ్రహ్మారెడ్డి, హరిబాబు, మారం రవి, తదితరులు పాల్గొన్నారు.
