తాళ్లూరు మండలం తూర్పుగంగవరం గ్రామానికి చెందిన మాజీ తెలుగు యువత అధ్యక్షులు, ఎల్ఐసి ఏజెంటు యాడిక శ్రీనివాసరెడ్డి(52) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి మాజీ ఎమ్మెల్యే పాపారావు, చైర్మన్ పిచ్చయ్య నివాళులర్పించారు. నివాళులు అర్పించిన వారిలో టీడీపీ మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శులు శాగం కొండారెడ్డి, మానం రమేష్, నాయకులు జాస్ట శ్రీనివాసరావు, డాని, పుట్ట నరసింహారావు తదితరులు ఉన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎల్ఐసి ఏజెంట్లు సంతాపం ప్రకటించారు.

