ఒంగోలు డీఎస్పీ వి. నారాయణస్వామిరెడ్డి కుమార్తె వివాహం శనివారం స్థానిక ఏ వన్ ఫంక్షన్ హాలులో జరిగింది. కడప జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్ హరినారాయణరెడ్డి, వాణి దంపతుల కుమారుడు తరుణ్ డీఎస్పీ కుమార్తె ప్రణతికి జరిగిన వివాహానికి ఒంగోలు ఎమ్మెల్యే,
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, ఎస్పీ మలికాగర్గ్, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, పలు వురు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రము ఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
