రైల్వే కేబుల్స్ దర్శి ప్రాంతంలో ఉందని తెలుసుకున్న ఆర్పిఎఫ్ అధికారులు, రైల్వే సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. దర్శి లోని ఓ పాత ఇనుప సామాను కొట్టులో సుమారు 80 లక్షల విలువచేసే 40,000 మీటర్ల రైల్వే కేబుల్స్ ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఐదుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారిని కోర్టుకు హాజరు పరిచినట్లు సమాచారం అందింది. ఇద్దరు రైల్వే కాంట్రాక్టర్ లు, సూపర్వైజర్లు పరారీలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల ఎంక్వైరీ జరుగుతున్నట్లు సమాచారం.
