దర్శి సామాజిక ఆరోగ్య కేంద్రం లో పరిస్థితి పై ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అక్కడికి వెళితే ఉన్న రోగాలు పోతాయో, కొత్త రోగాలు వస్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కనీసం పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టకుండా ఉండడంతో పై ఫోటో అక్కడ కనిపించింది. వర్షం కురిస్తే చాలు మురికి నీరు మొత్తం హాస్పిటల్ వైపే వెళుతుంది. హాస్పిటల్ కు వెళ్లే దారిలోనే ఆ విధమైన పరిస్థితి హాస్పిటల్ కు వెళ్లే వారికి కనిపిస్తుంది.
