రీసర్వే అధికారులకు భూ యజమానులు సహకరించాలి

భూములను రిసర్వ్ చేసేందుకు గ్రామాలకు వచ్చిన అధికారులకు భూముల యజమానులు సహకరించాలని ల్యాండ్ సర్వే డిప్యూటీ తహసిల్దార్ ఏ స్రవంతి అన్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం వీఆర్వోలు విలేజ్ సర్వేయర్లతో రీ సర్వేపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చనిపోయిన వారి పేరు మీద భూములు ఉన్నట్లయితే వారి వారసులకు ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేస్తామన్నారు. ఎవరైనా భూముల అమ్మినట్లయితే పేరు మీద ఉన్నట్లయితే కొన్న వారి పేరు మీద ఆన్లైన్ చేస్తామన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నా ..ఆన్లైన్లో ఉన్నా ఇతరుల మీద ఉన్నట్లయితే.. రికార్డులు ఆధారంగా పరిశీలించి ఆన్లైన్ చేస్తామన్నారు. అలాంటివారు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆధార్ కార్డు, బ్యాంకు ఎకౌంటు, పాస్ ఫోటో, ఫోన్ నెంబరు ఇవ్వాలన్నారు. రీ సర్వే త్రి ఫేస్ లో భాగంగా అవిసెనవారిపాలెం, బట్లపల్లి, చిన్న ఉల్లగల్లు, చింతలపూడి, కొమ్మవరం,తమ్మలూరు, వేముల బండ గ్రామాల్లో రిసర్వ్ జరుగుతుందని రైతులు భూ యజమానులు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు విలేజ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *