దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరులు తాళ్లూరు మండల వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ మద్దిశెట్టి రవీంద్ర సోమవారం మండలంలోని రజానగరం గ్రామ దేవత శ్రీ నాగర్పమ్మ తల్లి పొంగళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులు ఆయనకు గ్రామ శివారుల నుండి ఘన స్వాగతం పలికారు .అనంతరం గ్రామ దేవత శ్రీ నాగర్పమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు,జెడ్పిటిసి మారం వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ ఎస్.కె కాలేషావలి, ఎంపీటీసీ మేడగం వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పులి వికాస్, మాజీ సర్పంచ్ మేడగం శ్రీనివాసరెడ్డి ,మాజీ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరావు, కో ఆప్షన్ మెంబర్ కరిముల్లా , ,బెల్లంకొండ వారి పాలెం సర్పంచ్ పి .ఎస్. శ్రీకాంత్ రెడ్డి, తాళ్లూరు సర్పంచ్ మేకల చార్లెస్ సర్జన్ తదితరులు పాల్గొన్నారు.


