ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సోమవారం మండలంలోని రజానగరం గ్రామంలో శ్రీ నాగార్పమ్మ తల్లి దేవాలయ నెల పొంగళ్ల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నాగర్పమ్మ తల్లికి ప్రత్యేక పూజలునిర్వహించారు .తదనంతరం ఆంజనేయ స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ కు గ్రామస్తులు, మహిళలు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు . కార్యక్రమంలో సర్పంచ్ షేక్ కాలేషావలి ,మాజీ ఎంపీటీసీ పులి వికాస్, గ్రామ మాజీ సర్పంచ్ ఎం శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు, మహిళలు, మండల వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.







