మిరప సాగు పై రైతుల దృష్టి – వ్యవసాయ అధికారి ప్రసాదరావు

మిరప సాగుపై మండల రైతులు దృష్టి సారించారని మండల వ్యవసాయ అధికారి బి ప్రసాద్ రావు అన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా ఆయన మండలంలోని మల్కాపురం, రజానగరం గ్రామాలలో పర్యటించారు . మిరప సాగు చేస్తున్న పంట పొలాలను ఆయన పరిశీలించి రైతులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు అన్ని రకాల పంట సాగుల వైపు దృష్టి సారిస్తున్నారని చెప్పారు. రెండు రోజులలో 133.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. అన్ని రకాల పంట పొలాలకు, సాగుకుఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. మిరప పంట సాగు చేసే రైతులు నాట్లు వేయడానికి ముందు ట్రైకోడెర్మా వరిడి మందును పొలాలలో వేయాలని దీనివల్ల ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు రాకుండా ఇది నివారిస్తుందని అన్నారు. తదుపరి పంట 30 రోజుల దాటిన తర్వాత ఒక లీటరు వేప నూనెను పిచికారి చేయాలని చెప్పారు. ఆయన వెంట వ్యవసాయ సహాయకులు అశోక్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *