బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు విజయ నిర్మలకు ఘన సన్మానం

ముండ్లమూరు గ్రామంలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు విజయనిర్మల ను ఘనంగా సన్మానించారు. మండల కేంద్రమైన ముండ్లమూరు లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేసిన పి విజయనిర్మల బాపట్ల జిల్లా మార్టూరు హై స్కూల్ కు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్లిన విజయనిర్మలను ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి లత తో పాటు ఉపాధ్యాయులు పూల బొకేలు అందించి దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదని తెలిపారు. అలాగే గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి అంధకారాన్ని పోగొట్టే వారిని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ కే హజరత్ అలీ, శ్రీనివాస్ రావు ,భారతి ,చక్రపాణి, నరసింహారావు, శ్రీదేవి, భావన్నారాయణ, ఏడుకొండలు, ప్రభాకర్, శివరామ కోటేశ్వరరావు, ఆంజనేయులు, ప్రణతి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *