జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును నూకతోటి అరుణ కుమారికి మంగళవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు సాయి శక్తుల కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయాలని కోరారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ …ఉపాధ్యాయులు బావి భారత భవిష్యత్తుకు మార్గదర్శకులని అన్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ..ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గురువులకు మరింత బాధ్యతను పెంచుతుందని అన్నారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు నూక తోటి అరుణ కుమారుని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, ఒంగోలు నగర కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత, ఆర్ జె డి , ఇంచార్జ్ డిఇఓ వి .ఎస్ సుబ్బారావు లు కలిసి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నూక తోటి అరుణ కుమారికి మెమొంటో ఇచ్చి పూల మాలలతో దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. అవార్డు గ్రహీత కు పలువురు బంధుమిత్రులు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

