తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమవుతుందని ముండ్లమూరు మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని సుంకరవారిపాలెం ,మారెళ్ళ గ్రామాల్లో బుధవారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు రావాలన్న లోకేష్ తోనే సాధ్యమన్నారు. యువగలానికి ప్రజల నుండి భారీ స్పందన వస్తుందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని అన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు పేద ప్రజల కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చందాలన్న, పేదల జీవితాలు బాగుపడాలంటే టిడిపి అధికారంలోకి రావాలన్నారు. చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం టిడిపి మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి క్లస్టర్ సుంకర రాఘవరెడ్డి, యూనిట్ ఇన్చార్జి బరిగే రామ లక్ష్మయ్య, బూత్ కన్వీనర్ బాజీ, నందగోపాల్, తదితరులు పాల్గొన్నారు.


