రైతులకు సకాలంలో  పి.పి.ఎల్  ఎరువుల సరఫరా -జిల్లా స్థాయి పి.పి.ఎల్  డీలర్ల సమావేశం నిర్వహణ

ప్రకాశం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు ప్రారంభం కావడంతో  ప్రముఖ ఎరువుల ఉత్పత్తి  సంస్థ  పారాదీప్ ఫాస్పెట్  లిమిటెడ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలు కావేరి గ్రాండ్ హోటల్ లో డీలర్లు,పంపిణీ దారులు సమావేశం నిర్వహించారు.
పారాదీప్ ఫాస్పెట్  లిమిటెడ్ రీజనల్ హెడ్ కృష్జ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ రైతులకు లాభం చేకూర్చే విధంగా పారాదీప్ ఫాస్పేట్  లిమిటెడ్ సంస్థ లాభాపేక్ష లేకుండా తమ సేవలు అందించడం జరిగింది అని అన్నారు. ఎరువుల సబ్సిడీలలో  దేశవ్యాప్తంగా ఓకే ఎరువు ఓకే బ్రాండ్  భారత్ పేరుతో రైతులు శ్రమ లేకుండా తీసుకొవచ్చు అని  తెలిపారు.వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభం అవుతున్న తరుణంలో ప్యారాదీప్ తమ ఉత్పత్తులను రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు.అదే విధముగా ఎమ్.ఆర్.పి ధరలకు ఉత్పత్తులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని  పారాదీప్ సంస్థ  ఫాస్పెట్ రీజనల్ మేనేజర్  కృష్ణ మూర్తి  డీలర్లకు సూచించారు.రైతులకు వారధిగా డీలర్లు వ్యవహరించాలని కోరారు.
 సంస్థ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రఫీ మాట్లాడుతూ  ఒకే దేశం ఒకే ఎరువు పధకం  రైతులకు ఉపయోగాకరంగా ఉంటుందిఅన్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను మోడల్ ఫర్టిలైజర్ రిటైల్ షాప్ గా సేవలు అందిస్తూ ఈ కేంద్రాలలో రైతుల కావలసిన ఎరువులు, విత్తనాలు,వ్యవసాయ పరికరాలు ఒకే చోట దొరికిలా ఏర్పాటు ఉందని ఈ అవకాశం రైతు సోదరులు ఉపయోగించే విధముగా డీలర్లు చొరవ చూపాలని రఫీ కోరారు.
ఈ సందర్భంగా వర్షాభావ పరిస్థితులలో రైతులకు ఉపయోగపడే విధంగా పూర్ణా అడ్వాన్స్ ప్రోడక్ట్ ను సంస్థ ప్రతినిధులు లాంచ్ చేశారు.
కార్యక్రమంలో క్యాటగిరి హెడ్ ఆర హార్దిక్ భాటియా, సంస్థ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రభాకర్, జె.ఏ.లక్ష్మీ దేవి, జె.కె.ఎస్ ప్రసాద్,డి.బి.టి.ఎస్.వెంకట్రావు,దేసు వీరయ్య అండ్ సన్స్ యజమాని దేసు వీరయ్య,శ్రీనివాస ఏజెన్సీ యజమాని కొల్ల శ్రీరాములు, రాజేష్ జిల్లా ఎరువుల డీలర్ల పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *