స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడుకు 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాలని ఎస్పీ మలికా గర్గ్ చెప్పారు. కోర్టులో ఆరు గంటలపాటు వాదోపవాదాలు జరి గిన తరువాత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని స్పష్టం చేశారు. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఎలాంటి నిరసనలు తెలియడానికి వీలులేదని, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా శాంతి భద్రతలకు ఆటంకం కలిగించినా, ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బం దులు కలిగించినా చట్టపరంగా చర్యలు తీసుకుం టామన్నారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన బం దోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బలవం తంగా దుకాణాలు మూయించడం, స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలను మూయిం చడం లాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తారన్నారు. 30 పోలీసు యాక్ట్ అమ లులో ఉందని, చట్టాన్ని ఉల్లఘించడం, పోలీ సుల అనుమతి లేకుండా ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. అల్లర్లకు పాల్పడే వారిపై నిరంతర నిఘా కొనసా గుతుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. సోమవారం కొందరు తలపె తో సాధారణ జనజీవనానికి అసౌ ట్టిన బంద్ కర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులను ఎస్పీ ఆదేశించారు.
