“మార్గదర్శిని” కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ చెప్పారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయన అధ్యక్షతన మార్గదర్శిని కోఆర్డినేషన్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే “కలెక్టర్ గారి అతిధి” కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించినందున గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రత్యేకంగా మార్గదర్శిని సెల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పూర్వ విద్యార్థులు సంఘాలు, ఎన్.ఆర్.ఐ.లు కూడా చురుకైన పాత్ర పోషించేలా వారిని భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో రెగ్యులర్ గా పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ విషయాలను డి.ఈ.ఓ., డిప్యూటీ ఈ.ఓ.లు, ఆర్.ఐ.ఓ. నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో మార్గదర్శిని నోడల్ అధికారి సామా సుబ్బారావు, జడ్పీ సి.ఈ.ఓ. జాలిరెడ్డి, డి.ఈ.ఓ. వి.ఎస్.సుబ్బారావు, జి.ఎస్.డబ్ల్యు.ఎస్. అధికారి ఉషారాణి, ఆర్.ఐ.ఓ. సైమన్ విక్టర్, డి.ఎస్.డి.ఓ. లోకనాధం, జిల్లా ఉపాధి కల్పన అధికారి భరద్వాజ్, జిల్లా సాంఘిక సంక్షేమవ అధికారి లక్ష్మా నాయక్, ఇతర డెడికేటెడ్ మెంటార్స్ పాల్గొన్నారు.


