ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సొంత నిధులతో బెల్లకొండవారిపాలెం గ్రామంలో రోడ్డులు వెంబడి చెట్లు తొలగించడం చదును చేయడం వంటి పనులకుసహకరించారు. సోమవారం సర్పంచ్ పోశం సుమలత శ్రీకాంత్రెడ్డి, ఎంపీటీసీ గూడ సరస్వతి ప్రభాకర్ రెడ్డిలు ఒంగోలులోని ఎంపీ కార్యాలయంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డిను గజమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
