ఆర్బికే ఛానల్ ప్రసారాలను రైతులు వీక్షించాలి – తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు

రైతు భరోసా ఛానల్ ద్వారా ప్రతి రోజు ప్రసారం అవుతున్న పలు కార్యక్రమాలను రైతులు వీక్షించాలని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు.మన్నేపల్లి, మాధవరం గ్రామాలలో ఆర్ బి కే కేంద్రాలను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్బికే ఛానల్ ద్వారా దేశంలో వివిధ ప్రాంతాలలో రైతులు సాగులో చేపట్టిన నూతన పద్ధతులను తెలుసుకోవచ్చని చెప్పారు. అన్ని ఆర్బికేలలో ఛానల్లో నెల వారి ప్రసారాల వివరాలను తెలియజేసామని అన్నారు. వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, మత్య, పట్టు పరిశ్రమ, ఉద్యావన పంటల సమగ్ర సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు తెలియజెయ్యటానికి ఆర్బికే ఛానల్ చక్కగా ఉపయోగపడతాయని చెప్పారు. విఏఏ నాగ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *