ప్రకాశం జిల్లా దర్శి లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల సౌకర్యాలకు నిధులు మంజూరు చేయాలని విద్యాశాఖామంత్రి బొత్సా సత్యనారాయణను కలిసి దర్శి ఎమ్మెల్యే డాక్టరు మద్దిశెట్టి వేణుగోపాల్ కోరారు. ఈ సందర్భంగా బుధవారం మంత్రి బొత్సాను విజయవాడలో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి కళాశాల నిధులు గురించి మాట్లాడారు. అదేవిధంగా తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తిని కూడా కలిశారు .ఆయన వెంట నాయకులు ముండ్ల మూరు ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, కాలేషా వలి, రాంబాబులు తదితరులు ఉన్నారు.

