చేతివృత్తుల వారికి అత్యంత ఉపయోగం ప్రధానమంత్రి విశ్వకర్మ కౌసల్యా యోజన పథకం.- బిజేపి జిల్లా అధ్యక్షులు పి.వి శివారెడ్డి

దేశంలో హస్తకళలు, చేనేత, వడ్రంగి, నాయిబ్రాహ్మణ, చర్మకారులు, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు, శిల్పులు తదితర 18 రకాల చేతివృత్తుల వారిని లబ్ధిదారులుగా చేస్తూ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సెప్టెంబరు 17 ఆదివారం విశ్వకర్మ జయంతి రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా 13000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ కౌసల్య యోజన పథకం ఆయా వృత్తులవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని ప్రకాశంజిల్లా బిజేపి అధ్యక్షులు పివి శివారెడ్డి తెలిపారు. భవిష్యత్ లో విడతలవారీ మరిన్ని చేతివృత్తులను పథకంలో చేరుస్తారని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సెప్టెంబరు 17 ప్రధాని మోదీ జన్మదినంగా తెలుపుచూ, అదే రోజు ప్రధానమంత్రి విశ్వకర్మ కౌసల్య యోజన ప్రారంభిస్తున్న కార్యక్రమ విశేషాలను ప్రత్యక్షంగా లైవ్ కార్యక్రమంలో దర్శిద్దామని, ఆయా వర్గాల వారికి పథకం పై అవగాహన కలిగించేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు మేరకు అంత్యోదయ లక్ష్యం కోసం ఈ పథకంపై అవగాహన కల్పిద్దాం. ఒబిసి మోర్చా , ఆర్టిసెన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు.

ప్రధాని విశ్వకర్మ కౌసల్య యోజన పథకం వివరాలను తెలుపుతూ ప్రస్తుతం… సి.ఎస్.సి కేంద్రాలలో నమోదు చేసుకోవాలి. సి.ఎస్.సి సేవలు ఉన్న సచివాలయం కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థి 18 సంవత్సరాల వయసు నుండి ఉండాలని, పథకంలో సూచించిన 18 సాంప్రదాయకమైన చేతి వృత్తుల పనిలో కొనసాగుతూ ఉండాలని గత ఐదు సంవత్సరాలలో పీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, పీఎం స్వనిధి, ముద్ర తదితర లోన్లు తీసుకుని ఉండకూడదని, లోన్లు తీసుకుని ఉన్నా ఆ రుణాలు చెల్లించేసి ఉండాలని మరియు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులని తెలిపారు. రెండు దశల్లో ఐదు శాతం వడ్డీ రేటు తో లక్ష నుండి మూడు లక్షల వరకు రుణం లభిస్తుందని మరియు ఆయా వృత్తుల వారికి శిక్షణ ఇచ్చి ప్రధానమంత్రి కౌశల్య యోజన సర్టిఫికెట్ తో కూడిన గుర్తింపు కార్డు అందిస్తారని, శిక్షణ సమయంలో స్టైఫండ్ కూడా ఇస్తారని పథకపు ప్రయోజనాలను తెలిపారు. మరిన్ని వివరాలకు బిజెపి ఆర్డిసన్ రాష్ట్ర కన్వీనర్ బంగారుబాబు 9705654877, బిజెపి ఒబిసి విశ్వకర్మ కౌసల్య యోజన రాష్ట్ర కన్వీనర్ కర్రి రాఘవ 9640761599 లను సంప్రదించాలని తెలిపారు. ప్రభుత్వ విశ్వకర్మ పోర్టల్ లో పేరు నమోదు చేసుకోవాలని పివి శివారెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *