ప్రభుత్వ పథకాలతో రైతులు అభివృద్ధి చెందాలి – ప్రభుత్వ పథకాలతో రైతులు అభివృద్ధి చెందాలి

గ్రామాల్లోని పాడి రైతులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందాలని ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశపహాలులో గురువారం వైకెపి ఎపిఎం ఎం హనుమంతరావు అధ్యక్షతన పాడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాల వెల్లువ ద్వారా అమూల్ పాల కేంద్రాలకు పాలు పోసే రైతులకు పీడీసీసీ బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందన్నా రు. వైకెపి ఎపిఎం ఎం హనుమంతరావు మాట్లాడుతూ దీర్ఘకాలిక రుణాల ద్వారా ఒక గేదకు ఒక లక్ష 30 వేలు, స్వల్ప కాలిక రుణాల ద్వారా ఆవుకు 85 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గేదె మేతకు 40 వేలు, ఆవు మేతకు 30 వేలు, షెడ్డు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పశువైద్యాధికారిని ఎం విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద పాడి పశువులకు యూనిట్లు పెట్టుకునేవారు రెండు లక్షల నుండి 20 లక్షల వరకు రుణాలు పొందవచ్చు అన్నారు. గేదెల ఫారం, ఆవుల ఫారం ,కోళ్ల ఫారాలు ,కందిపప్పు మిల్లు, టెంట్ హౌస్, ఫోటోగ్రఫీ, డిజె సౌండ్ సిస్టం, చెక్క సెంట్రింగ్, లకు ప్రభుత్వం 35 శాతం రాయితీపై రుణాలు అందిస్తామన్నారు. ఇలాంటి అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ పి ఆర్ డి శ్రీదేవి, పి డి సి సి బ్యాంకు సూపర్వైజర్ సిద్దయ్య, రూట్ ఆఫీసర్ మాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *