ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న రాయితీ రుణాల ను పాడి రైతులు అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు అన్నారు. ముండ్లమూరు మండలంలోని నాయుడుపాలెం గ్రామంలో శనివారం వైకెపి ఎపిఎం ఎం. హనుమంతరావు అధ్యక్షతన జగనన్న పాలవెల్లువపై ఋణమేళ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ… బ్యాంకుల ద్వారా అందిస్తున్న రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. గ్రామాలలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు అమూల్ పాల కేంద్రాలకు పాలు ఎక్కువ పోసే విధంగా కృషి చేయాలన్నారు. వైకేపి ఏపిఎం ఎం. హనుమంతరావు మాట్లాడుతూ …రెండు లక్షల నుండి 20 లక్షల వరకు 35శాతం రాయితీపై రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయన్నారు. ఒక గేదేకు రూ. 1లక్ష1300 రూపాయలు, ఆవుకు 85 వేల రూపాయలు రుణాలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి కాశీ విశ్వనాధ రెడ్డి, ఈవో పి ఆర్ డి శ్రీదేవి, పి డి సి సి బ్యాంకు సూపర్వైజర్ సిద్దయ్య, పాడి రైతులు పాల్గొన్నారు.


