భారత దేశాభివృద్ధిలో భాగమైన ఏ బిల్లు అయినా సాధించగలిగేది నరేంద్ర దామోదర్ దాస్ మోడీయేనని మరొకసారి రుజువు అవుతున్నదని బిజేపి ప్రకాశంజిల్లా కార్యదర్శి తీగల సత్యవతి తెలిపారు. మహిళలకు 33 శాతం చట్టసభలలో ప్రాతినిధ్యం ఇవ్వాలని దేశ మేధావులు, మహిళా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు గత ముప్పై సంవత్సరాలుగా కంటున్న కలలు తీరబోతున్న తరుణం ఇదే…
ఎంతో అద్భుతంగా, సర్వాంగ సుందరంగా, భారతీయత ఉట్టిపడేటట్టుగా నిర్మించుకున్న పార్లమెంటు సముదాయ భవనములో మొట్టమొదటి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు కావడం చరిత్రలో నిలిచిపోయే రోజు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనం కొత్త ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం చేసే రోజు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అదేవిధంగా సాంప్రదాయం ప్రకారం కొత్త పార్లమెంటు భవనంలో మొదటగా మహిళా బిల్లును ప్రవేశపెట్టడం భారతీయ మహిళలోకం గర్వించే రోజు.
మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళా సాధికారత కోసం, అభ్యున్నతి కోసం, సహకారం కోసం, రక్షణ కోసం, విద్యాభివృద్ధి కోసం, కుటుంబ వికాసం కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం, కౌమార బాలికల సౌకర్యం కోసం, ఆడబిడ్డకు జన్మనిచ్చి విధి వక్రించి తల్లిని కోల్పోయిన బిడ్డ రక్షణకు, విద్యా ఉద్యోగ అవసరాల కోసం ఇల్లు వదిలి నగరాలలో కాపురం ఉంటున్న మహిళల రక్షణ కోసం (రక్షణతో ప్రత్యేక హాస్టళ్లు) తీసుకువచ్చి, వారి ఉజ్వల భవిష్యత్తు ధగద్ధమాయంగా వెలిగేటట్లు, ప్రత్యేకంగా ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ బిల్లు ఎత్తివేత (దీని ద్వారా ఏ వ్యక్తి (ముస్లిం అయినా) బహుభార్యత్వం కలిగి ఉండకూడదు. ఇటువంటి బృహత్తరమైన ఆలోచనతో సమాజంలో అన్ని వర్గాల మహిళలకు సకల సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందేటట్టుగా అమలు చేస్తున్నారు.
మహిళల కోసం మోదీ ప్రవేశపెట్టిన పథకాలు/స్కీములు
- సుకన్య సమృద్ధియోజన,
- బేటి పడావో బేటి బచావో,
- ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం,
- సురక్షిత మాతృత్వ హామీ సుమన్ యోజన,
- ఉచిత కుట్టు యంత్ర పథకం,
- మహిళా శక్తి కేంద్ర పథకం,
- ప్రధానమంత్రి కౌశల్ వికాస కేంద్రాలు,
- ప్రధానమంత్రి మాతృ వందన యోజన,
- కౌమార బాలికల పథకం,
- వర్కింగ్ ఉమెన్ హాస్టల్ సౌకర్యం,
- మహిళల ఆత్మగౌరవం కోసం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి పథకం,
- పోకిరిలను నిలువురించుటకు నిర్భయ చట్టం
- మహిళా పోలీస్ వాలంటీర్ పథకం (మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ ఎలాంగ్ విత్ హోం ఎఫైర్స్ క్రింద పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వాధీనం లోనిది)
దేశ పురోభివృద్ధి లో మహిళలు సగ భాగమని, దేశాభివృద్ధిలో వారి పాత్ర సగ భాగం ఉండాలనే తలంపుతో ఆలోచనతో ప్రధాని మోదీ అన్ని రంగాలలో కూడా మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్న నరేంద్ర మోదీ కి దేశ మహిళలోకమంతా ఉవ్వెత్తును జేజేలు పలకాలని విన్రమంగా వినయ పూర్వకంగా కోరుకుంటునట్లు బీజేపీ జిల్లా కార్యదర్శి మరియు ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ఇంచార్జి తీగల సత్యవతి తెలిపారు.
