ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యావిధానం మార్పుకు చేసిన కృషి పట్ల అస్ట్రేలియా గ్లోబల్ ఎడ్యుకేషన్ సొస్యూషన్స్ సీఈఓ రాక్వల్ ప్రాఫ్ హర్షం వ్యక్తం చేసారు. జిల్లా విద్యాశాఖాధికారి వి. ఎస్ సుబ్బారావు, పరిషత్ విద్యాశాఖాధికారి (పీఈఓ) సోమా సుబ్బారావులతో కలసి ప్రకాశం జిల్లాలో పలు పాఠశాలలను, ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాన్ని, రామచంద్ర మిషన్ ను సందర్శించారు. పాఠశాలలలో విద్యార్థుల యూనిఫామ్, ష్యూష్, నాడు-నేడుతో పాఠశాలల మార్పు, విద్యా విధానంలో కేరీర్ గైడెన్స్, మార్గ దర్శినిపై విద్యాశాఖ చేస్తున్న కసరత్తును గమనించారు. మార్పును గమనించి హర్షం వ్యక్తం చేసారు. ముందుగా ఆమెకు విద్యాశాఖ అధికారులు, రోటరీ క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.


