అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా జెసిబి క్రెన్ డ్రైవర్కు ఐదేళ్లు పాటు జైలు శిక్ష విధిస్తూ గురువారం పీఏ ఎస్ జె న్యాయమూర్తి కె సత్యకుమారి తీర్పు వెలువరించారు. వివరాలు… చీమకుర్తి మండలం రామతీర్థం గుడి సమీపంలో 2020 ఫిభ్రవరి 6వ తేదీన రాత్రి వేళ క్వారీ ప్రదేశంలో జెసిబి క్రెన్ డ్రైవర్ దేవరల మహీంద్రా లారీలోనికి గ్రానైట్ రాళ్లు ఎక్కించి సమయంలో అజాగ్రత్త వలన క్రేన్ తిరగబడి ఇరువురు మృతి చెందారు. చీమకుర్తి మండలం ఆర్ పురంకు చెందిన బండారు ప్రసాద్. ఎన్పాడు గ్రామానికి చెందిన ముద్రగడ్డ కళ్యాణ్ కుమార్ మృతి చెందారు. చీమకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి ఒంగోలు రూరల్ సీఐ పి సుబ్బారావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ముద్దాయిలైన జెసిబి యజమాని ఇమాం సాహేబ్, డ్రైవర్ దేవరల మహీంద్రాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సరైన ఆధారాలతో కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆడిషనల్ పీపీ పద్మజ ప్యాసిక్యూషన్ తరుపున వాదించారు. విచారించిన న్యాయమూర్తి ఎ-1 ముద్దాయి డ్రైవర్ మహీంద్రాకు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, రెండవ ముద్దాయి ఒనర్ షేక్ ఇమాం సాహేబ్ కు మూడు నెలల సాధారణ జైలు శిక్ష, ఐదు వేలు జరిమాన విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
*పోలీసులకు జిల్లా ఎస్పీ అభినందన ….**
న్యాయ స్థానంలో ఎస్పీ మలిక గర్గ్ మార్గదర్శకంలో గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా సరైన సాక్ష్యాలు ప్రవేశ పెట్టి నిందితులకు శిక్ష పడటంతో కృషి చేసిన అప్పటి ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు, కోర్టు లైజన్ మాలకొండయ్య, చీమకుర్తి కోర్టు డాలి సేబర్ హరిక్రిష్టలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు..