చంద్రబాబు అరెస్టుకు మూల్యం తప్పదు : డాక్టర్ ఉగ్ర

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష కొనసాగుతున్నాయి. 9వ రోజూ గురువారం టిడిపి బీసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వివిధ రకాల కుల వత్తుల పరికరాలను దీక్ష శిబిరం ఎదుట ప్రదర్శించారు. చంద్రబాబుకు అండగా ఉంటామంటూ వినూత్నమైన రీతిలో నిరసన తెలిపారు. నాయీ బ్రాహ్మణులు డోలు, సన్నాయి వాయిస్తూ మేము సైతం బాబుతో అంటూ శ్రీ నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహా రెడ్డి మాట్లాడుతూ…. టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయవచ్చుననే పిచ్చి భ్రమతోచంద్రబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు. అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. దేశ విదేశాల్లో చంద్రబాబుకు లభిస్తున్న మద్దతే అందుకు నిదర్శనమని తెలిపారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలనిడిమాండ్ చేశారు. చంద్రబాబుకు న్యాయం వరకూ దీక్షలు కొనసాగిస్తామన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీక్షల్లో బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోరబోయిన గంగరాజు యాదవ్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కసుమురి మౌలాలి, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు చింతలపూడి తిరుపాలు, టిడిపి మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు యాదవ్, వీర నరసింహస్వామి, లూరి సత్యం, అర్వి.నారాయణ, యారగొర్ల రమేష్, కెవిఎస్.గౌడ్, హరికొండ ప్రసాద్, బత్తులసత్యనారాయణ, దాసరి మాలకొండయ్య, డేగా నాగరాజు, బాల నారాయణ, వేమూరి బ్రహ్మయ్య, పిన్నిగ బాల కోటయ్య, గంజికొండ శ్రీను, చిలకపాటి లక్ష్మయ్య, చెరుకూరి కాశయ్య, కాసుల శ్రీరాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *